
సదరు దర్శకుడు తనను సినిమా నుండి తప్పించాడనీ అలాగే కొన్ని సినిమాల ఆడియో వేడుకల్లో కూడా తాన్ లేకుండా చేశాడని…అలాగే తన మీద మీడియా లో నెగటివ్ ఆర్టికల్స్ రాయించాడని..దీంతో తాను డిప్రెషన్ లోకి వెళ్ళింది అని చెప్పుకొచ్చింది..సమస్యను పరష్కరించుకుందాం అని తాను అంటే వాయిదా వేసుకుంటూ వచ్చాడని చెప్పింది.తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాను అంటే..’ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఒకే రోజు వార్త అవుతావు ,అంతకు మించి ఏమీ జరగదు’ అని ఆ దర్శకుడు అన్నాడని పూనమ్ చెప్పింది. స్టేజ్ మీద సావిత్రి గారి గురించి గొప్పగా మాట్లాడాడు కానీ లోకల్ టాలెంట్ ను ఎప్పుడు ప్రోత్సహించడు..అని తన ఆవేదన వ్యక్తం చేసింది పూనమ్ కౌర్..కానీ విచిత్రం ఏమిటంటే పూనమ్ ఆ డైరెక్టర్ పేరును ఎక్కడా వెలువడించలేదు.

