పూజా హెగ్డే కెరియర్ ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈమె దుల్కల్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే మలయాళం తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి విజయాలని సొంతం చేసుకుని రేసుగుర్రం లా దూసుకుపోతున్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతను అంగీకరించిన మరొక తెలుగు చిత్రమే ఆకాశం లో ఒక తార. ఈ సినిమాలో పూజా హీరోయిన్ గా చేసి ఆ సినిమా హిట్ అయితే ఆమె కెరియర్ మళ్లీ ఉపందుకుంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు..!!