in

Pooja Hegde to grace Cannes International Film Festival from india!

టాలీవుడ్‌ అందాల భామ పూజా హెగ్దేకు అరుదైన అవకాశం దొరికింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు భార‌త ప్ర‌తినిధిగా ఆమె హాజ‌రు కానున్నారు పూజా హెగ్దే. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడు‌క‌లు ఈ నెల 17న మొద‌లు కానున్నాయి. ఈ నెల 28 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఈ వేడుక‌ల్లో భార‌త ప్ర‌తినిధిగా పూజా హెగ్డే హాజ‌రుకానున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే…ద‌క్షిణాది చిత్రాల్లో స‌త్తా చాటుతున్న పూజ‌… కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడుక‌ల‌కు ఈ ఏడాదే తొలిసారి హాజరు కానుంది.

అంటే… ఈ వేడుక‌ల‌కు తొలిసారి హాజ‌రవుతున్న స‌మ‌యంలోనే భార‌త దేశ ప్ర‌తినిధిగా వేడుక‌ల్లో ఆమె ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నార‌న్న మాట‌. పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు..

Raveena Tandon recalls she was fat-shamed after post-pregnancy!

Telugu Side Actress Jyothi in Black Salwar Stills!