in

Pooja Hegde is still scared to remember her old days!

సినిమా ఇండస్ట్రీ లో తన పాత రోజుల గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ.. ‘ప్రతిఒక్క నాయిక కెరీర్‌లో తొలి అడుగు చాలా ముఖ్యం. ‘మొహంజదారో’ జాతీయస్థాయిలో ఆసక్తినిరేకెత్తించింది. ఆ సినిమాతో కెరీర్‌కు ఢోకా లేదనుకున్నా. అయితే అంచనాలన్నీ తలక్రిందులు కావడంతో చాలా నిరుత్సాహపడ్డాను. తొలి చిత్రం ఫెయిల్‌ అయితే మరలా అవకాశం సంపాదించుకోవడం అంత సులభం కాదు. కొద్ది మాసాలపాటు నా కెరీర్‌పై సందేహాలు కమ్ముకున్నాయి. ఆ రోజులు తలచుకుంటే భయంగా అనిపిస్తుంది.

ఫెయిల్యూర్‌ను మరచిపోయి అవకాశాల మీద దృష్టిపెట్టా. ప్రతి సినిమా కోసం అంకితభావంతో పనిచేశా. ఇప్పుడు నేను కోరుకున్న స్థానానికి చేరుకున్నాననే సంతృప్తి ఉంది. తొలి పరాజయాలతో ఎవరూ నిరుత్సాహపడొద్దు. పరిశ్రమలో జయాపజయాలు ఒక్కరి చేతిలో ఉండవన్న సత్యాన్ని తెలుసుకొని ధైర్యంగా ముందడుగువేయాలి’ అని సూచించింది పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘రాధేశ్యామ్‌’ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తోంది..

Chaitanya-Ananya’s ’30 Weds 21′ Creates A Sensation On Youtube!

India’s youngest IPS officer is a fan of superstar Mahesh Babu!