in

pooja hegde clarifies on ‘South’s navel obsession’ controversy!

త రెండు మూడు రోజులుగా పూజా హెగ్డే వార్తలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దక్షిణాది ప్రేక్షకులు, టాలీవుడ్ గురించి పూజా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపలను సృష్టించాయి. అన్నం పెట్టిన ఇండస్ట్రీని ఆధరించిన అభిమానులను కించపరిచేలా పూజా హెగ్డే మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. దీనిపై పూజా హెగ్డేను సోషల్ మీడియాలో ఏకిపారేశారు. దక్షిణాది వారికి నా నడుము చూపిస్తే చాలు.. వారు అదే మత్తులో ఉంటారు.. మిడ్ డ్రెస్‌లోనే చూడాలనుకుంటారు అంటూ ప్రేక్షకుల గురించి, టాలీవుడ్ గురించి మాట్లాడింది. అల వైకుంఠపురములో సినిమాలో కాళ్ల ఫాంటసీ గురించి చెబుతూ నవ్వింది.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపగా.. తాజాగా పూజా హెగ్డే ఓ వివరణ ఇచ్చుకుంది. కానీ జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. నేను ఒక ఇంటర్వూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు.. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికి నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా.. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను.. మీరు మొత్తం ఇంటర్వ్యూను చూడండి’ అని పూజా హెగ్డే వేడుకుంది.

rana launches his new YouTube channel!

thamanna faced the thought of death!