
అల్లు అర్జున్ సరసన “డీజే”, ఎన్టీఆర్‌తో “అరవింద సమేత”, మహేష్ బాబు సరసన “మహర్షి” , వరుణ్‌తో “వాల్మీకి” చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా “అల వైకుంఠపురములో” నటించిన పూజా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ చిత్రంతో బిజీగా ఉన్న పూజా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ వినోద్ మెహ్రా తనయుడు రోహన్ వినోద్ మోహ్రాతో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి..వీరిద్దరూ పలుమార్లు బైట మీడియా కు చిక్కడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరుస్తుంది..వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువగానే ఏదో ఉందనే మాట కోడై కూస్తుంది..అయితే మీడియా లో చాలాకాలం నుండి ఇంత ప్రచారం జరుగుతున్న.. ఈ ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరు ఇది కేవలం రూమర్ మాత్రమే, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ఇంతవరకు చెప్పకుండా ముఖం చాటేయడంతో నిజంగా వీరు ప్రేమలో మునిగిపోయారని తెలుస్తుంది.. దీనిమీద పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి..కానీ నిప్పు లేనిదే పొగ రాదు..నిజం ఎప్పటికి దాగదు గా.

