in

MEGASTAR THANKS UPASANA!

కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ‘సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ) మనకోసం’ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీసీసీకి ఇప్పటికే తారలు సహా పలువురు దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. దాతలు ఇచ్చిన విరాళాలతో ఇప్పటికే సహాయ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కోడలు ఉపాసనకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఎందుకని అనుకుంటున్నారా? సీసీసీ ద్వారా పేద సినీ కార్మికులకు రూ. 500 నుంచి రూ. 1000 రూపాయలు విలువ గల మందులను ఉచితంగా అపోలో తరుపు నుంచి ఉపాసన, రామ్ చరణ్‌లు అందించడానికి ముందుకు వచ్చారని ఇప్పటికే తమ్మారెడ్డి, ఎన్ శంకర్ తెలిపి ఉన్నారు.

ఈ సహాయంలో ప్రముఖ పాత్ర వహించిన ఉపాసనకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ”కరోనా క్రైసిస్ చారిటీ సంస్థ తరపున అవసరార్ధులైన పేద సినీ కార్మికులకు అపోలో ఫార్మసీ ద్వారా ఉచితంగా మందులు అందించడంలో ప్రముఖ పాత్ర వహించిన నా కోడలు ఉపాసనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీది చాలా గొప్ప హృదయం” అని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

ismart beauty Nidhi!

POOJA HEGDE AFFAIR!