in

Pooja Hedge reveals she slapped a star hero!

స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజ హెగ్డే చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. కెరీర్ మొదట్లోనే ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఆ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నానని పూజ తెలిపింది. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె చెప్పింది..

షూటింగ్ జరుగుతున్న సమయంలో తన అనుమతి లేకుండానే ఆ సినిమాలో నటించిన స్టార్ హీరో తన క్యారవాన్‌లోకి వచ్చాడని పూజ వెల్లడించింది. అప్పటికే అది తనకు అసౌకర్యంగా అనిపించిందని, ఆ తర్వాత అతడు అసభ్యంగా ప్రవర్తించడంతో పూర్తిగా షాక్‌కు గురయ్యానని చెప్పింది. ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాకపోయినా, చివరికి సహనం కోల్పోయి అతడిని లాగిపెట్టి కొట్టానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలా చేయగానే అతడు క్యారవాన్ నుంచి బయటకు వెళ్లిపోయాడని పూజ వివరించింది. ఈ ఘటన తర్వాత ఆ హీరోతో కలిసి నటించాలనే ఆసక్తి పూర్తిగా పోయిందని, అందుకే తన సీన్స్‌ను డూప్‌తో షూట్ చేశారని తెలిపింది..!!

f cube ‘Dimple Hayathi’

i am not married, Dimple Hayathi clarifies!