
1970 దశకం లో స్టార్ కమెడియన్ గ వెలిగి పోతున్న రాజ బాబు గారు మద్రాసు లో తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. అప్పట్లో శివాజీ గణేశన్ గారి వద్ద ఖరీదయిన ఇంపోర్టెడ్ కార్ ఉండేది. ఆ కార్ లో శివాజీ గణేశన్ గారు రోజు రాజ బాబు గారి ఇంటి ముందు నుంచి వెళుతూ ఉండే వారు ఆ కారు తళుకు బెళుకు మరియు విచిత్రమయిన హార్న్ శబ్దం విన్న వారు అబ్బా ఎంత బావుందో అనుకోకుండా ఉండలేరు. మన రాజ బాబు గారి పిల్లలు కూడా ఆ కారు మీద మోజు పడి, నాన్నారు మనం కూడా అటువంటి కారు కొనుక్కుందాం అని అడిగే సరికి, రాజ బాబు గారు ఆ కారు కొందామని వెళితే తయారీదారు ఆ కారు కేవలం ఆర్డర్ మీదే తయారు చేస్తాము అందుకు ఆరు నెలలు టైం పడుతుంది అని చెప్పారట. ఆలోచనలో పడిన రాజ బాబు గారు శివాజీ గారి ఇంటికి వెళ్లారట, సాదరంగ ఆహ్వానించి విషయం అడిగారట. వెంటనే రాజ బాబు గారు మీ కారు నాకు కావాలి మా పిల్లలు ముచ్చ్చట పడుతున్నారు ఎంతో డబ్బు పంపుతాను అన్నారట, విన్న శివాజీ గారు ఆ కారు ఎంత అనుకున్నావు రాజ బాబు ఒక లక్ష రూపాయలు, పది వేలు కాదు అన్నారట, ఆ రోజులలో లక్ష రూపాయలు అంటే పెద్ద మొత్తమే మరి. నేరుగా ఇంటికి వచ్చిన రాజ బాబు లక్ష రూపాయలు తీసుకెళ్లి శివాజీ గారి చేతిలో పెట్టి కారు కీస్ ఇవ్వండి సార్ ఇంకేమయిన బాలన్స్ ఉంటె చెప్పండి పంపుతాను అన్నారట, ఒకింత ఆశ్చర్యానికి గురి అయినా, రాజ బాబు పట్టుదల గురించి తెలిసిన ఆయన మరు మాట లేకొండ కారు కీస్ రాజ బాబు చేతిలో పెట్టారు. ఆ కారు లో పిల్లలను ఎక్కించుకొని తానే డ్రైవ్ చేస్తూ మద్రాసు సిటీ అంత తిప్పి వాళ్ళ ముచ్చ్చట తీర్చారు, దీనిని పట్టి చెప్ప వచ్చు రాజ బాబు గారు ఎంత భోళా శంకరుడో.

