in

People have forgotten my other works after ‘Oo Antava’: samantha

త ఏడాది చైతూతో వివాహ బంధంలో ఉండగానే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్లో సమంత సెన్సేషనల్ రోల్‌తో అందరికీ పెద్ద షాకిచ్చింది. వివాహానంతరం ఇంత బోల్డ్ రోల్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆ తర్వాతే తెలిసింది చైతూ నుంచి ఆమె విడిపోతోందని. అధికారికంగా విడాకులయ్యాక ఈ మధ్య ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా’ ఐటెం సాంగ్‌లో సమంత ఎంత షాకింగ్‌గా కనిపించిందో తెలిసిందే.

కెరీర్లో ఇప్పటిదాకా ఎన్నడూ లేనంత హాట్‌గా ఈ పాటలో కనిపించి అందరినీ విస్మయానికి గురి చేసిందామె. ఈ పాట ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా సామ్ ‘ఫ్యామిలీ మ్యాన్’లో తన పాత్రకు సంబంధించి ఒక అవార్డు అందుకోవడానికి ముంబయి వెళ్లింది. అక్కడ అందరి చూపులూ సమంత మీదే పడేలా సూపర్ హాట్‌గా డ్రెస్ చేసుకుని వెళ్లింది. ఈ ఫొటోలు నిన్న సాయంత్రం నుంచి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అవార్డుల వేడుకలో సమంత మాట్లాడుతూ..

ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్, ఊ అంటావా పాటలు తనకు తెచ్చిన పాపులారిటీ గురించి ప్రస్తావించింది. ‘‘ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్‌తో పాటు ఊ అంటావా పాట నాకు పాన్ ఇండియా స్థాయిలో నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అభిమానులు చూపించే ప్రేమాభిమానాల గురించి మాటల్లో చెప్పలేను. ఊ అంటావా పాట ఇంత విజయం సాధిస్తుందని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ నేను చేసిన సినిమాలన్నింటినీ మర్చిపోయారు. ఇక ముందు నన్ను ఈ పాటతోనే గుర్తు పెట్టుకునేలా ఉన్నారు’’ అని సమంత పేర్కొంది.

actress Archana gautham’s magic dint work in up elections!

Aadi Saikumar picks television beauty Digangana Suryavanshi!