in

‘pelli sandhadi’ girl Sree Leela to play Balakrishna’s daughter?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో ఎన్‌బీకే 108 రాబోతున్న విష‌యం తెలిసిందే. గోపీచంద్ మ‌లినేనితో చేస్తున్న సినిమా పూర్త‌వ‌గానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ సర్కిల్ టాక్‌. కాగా ఎఫ్ 3 సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ‌తో చేయ‌బోయే సినిమా గురించి ఆస‌క్తికర విష‌య‌మొక‌టి రివీల్ చేశాడు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఈ చిత్రంలో పెళ్లిసందD ఫేం శ్రీలీల‌ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంద‌ని, ఇందులో బాల‌కృష్ణ కూతురిగా క‌నిపించ‌బోతుంద‌న్నాడు అనిల్ రావిపూడి. బాల‌కృష్ణ‌ను ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని కామెడీ ట‌చ్ ఉన్న పాత్ర‌లో చూడ‌బోతున్నార‌ని చెప్పాడు.

ఈ సినిమాలో బాల‌కృష్ణ యాక్టింగ్‌తో అంద‌రి అటెన్ష‌న్ త‌న‌వైపు తిప్పుకోవ‌డం గ్యారంటీ అని అన్నాడు. అయితే ‘అర్జున్‌రెడ్డి’, ‘పోకిరి’, ‘గబ్బర్‌సింగ్‌’ హీరోలను డైరెక్ట‌ర్లు చూపించిన విధంగా బాలకృష్ణను స‌రికొత్త‌గా చూపించ‌డం నాకు ఛాలెంజ్ లాంటిది. ఈ సినిమాలోపాత్ర ఆధారంగా బాల‌కృష్ణ మేన‌రిజ‌మ్ ఉండబోతుంద‌ని చెప్పాడు అనిల్ రావిపూడి. బాల‌య్య‌లోని కామెడీ యాంగిల్ గ‌తంలో ఎన్న‌డూ చూపించ‌ని విధంగా ఈ ప్రాజెక్టులో చూపించేందుకు ప్ర‌యత్నం ఉండ‌నుంద‌ని చెప్పుకొచ్చాడు. అనిల్ డైరెక్ట‌ర్ చేస్తున్న ఎఫ్ 3 మే 27 థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది.

Bindu Madhavi Bags Key Role In Anil Ravipudi’s Next!

sai pallavi clarifies about not doing item songs!