పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసింది. ఓ అమ్మాయి పబ్లిక్ ప్లేస్‌లో పీరియడ్స్ కావడం, దానిపై పక్కనే ఉన్న ఓ యువకుడు స్పందించిన తీరుపై పాయల్ పోస్ట్ చేసింది. తన కూతురు ఓ పబ్లిక్ బస్‌లో ప్రయాణిస్తుండగా మొదటిసారి పీరియడ్స్ జరిగాయని, దాంతో ప్యాంటుపై రక్తపు మరకలు పడటం చూసి పక్కనే ఉన్న ఆమెకంటే పెద్దవాడైన ఓ కుర్రాడు ఆ విషయాన్ని చెప్పి..
తన స్వెటర్ ఇచ్చిమరీ అది నడుముకు చుట్టుకొని ఇంటికి వెళ్ళమని తన కూతురుతో చెప్పాడంటూ ఓ తండ్రి ఇచ్చిన వివరణ ఆ ఫొటోపై రాసి ఉంది. పాయల్ ఆ ఫొటో, మెసేజ్‌ని తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసి అతనికి ధన్యవాదలు తెలిపింది. ఆ కుర్రాడు స్పందించిన విధానం బాగుందని క్లాప్స్ కొట్టింది. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పాయల్ పెట్టిన ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.