in

Payal Rajput Is Bengaluru Mafia Don’s Girlfriend!

తెలుగు చిత్రసీమలో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది పంజాబీ సుందరి పాయల్‌ రాజ్‌పుత్‌. తాజాగా బయోపిక్‌ చిత్రంతో ఆమె కన్నడ సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయబోతున్నది. బెంగళూరు తొలి మాఫియాడాన్‌గా పేరుతెచ్చుకున్న జయరాజ్‌ జీవితం ఆధారంగా ‘హెడ్‌బుష్‌’ పేరుతో కన్నడంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. జయరాజ్‌ పాత్రలో ధనుంజయ్‌ నటిస్తున్నారు. అతడి ప్రియురాలిగా పాయల్‌ రాజ్‌ఫుత్‌ను చిత్రబృందం ఎంపికచేసింది.

నిజజీవితంలో జయరాజ్‌ ప్రియురాలు పంజాబీ ప్రాంతానికి చెందిన మహిళ కావడంతోనే చిత్రబృందం పాయల్‌రాజ్‌పుత్‌ను ఈ పాత్ర కోసం తీసుకున్నట్లు తెలిసింది. నెగెటివ్‌ షేడ్స్‌తో ఆమె క్యారెక్టర్‌ సాగుతుందని సమాచారం. పాత్ర తీరుతెన్నుల కోసం జయరాజ్‌ ప్రియురాలిని పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రత్యక్షంగా కలవనున్నట్లు చెబుతున్నారు. 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శూన్య దర్శకత్వం వహిస్తున్నారు. చాలెంజింగ్‌ పాత్రతో కన్నడ చిత్రసీమకు పరిచయం కానుండటం అదృష్టంగా భావిస్తున్నానని పాయల్‌ రాజ్‌పుత్‌ చెప్పింది.

Bellamkonda Sreenivas is ‘Stuartpuram Donga’!

Sonakshi Sinha’s whopping remuneration for Chiranjeevi’s film?