in

Payal Rajput and naina ganguly supports promoting alcohol brands!

టీవల కాలంలో చాలా సందర్భాల్లో ప్రముఖులు ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. వారు చేసే వాణిజ్య ప్రకటనలు కూడా చర్చలకు దారితీస్తున్నాయి. గతంలో కాజల్, సమంత, రెజీనా లాంటి హీరోయిన్లు లిక్కర్ బ్రాండ్లకు ప్రచారం చేయగా.. వారిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. మొన్నటికి మొన్న నిధి అగర్వాల్ కండోమ్ యాడ్స్‌కు ప్రచారం చేసిందని.. నెట్టింట పెద్ద దుమారమే రేగింది. ఈ విధంగా మద్యం తయారీ కంపెనీలు, కండోమ్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నవారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కూడా చేరిపోయింది.

ఆమె ఓ విస్కీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయగా.. విమర్శలు రావడంతో ఆ పోస్టును తొలగించింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మపై ట్రోలింగ్ ఆగలేదు..దీంతో విసుగు చెందిన పాయల్.. కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె కామెంట్లు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. “ప్రభుత్వం ఆమోదించిన బ్రాండ్లను ప్రమోట్ చేయడంలో తప్పేముంది. అయినా అది లీగల్ కూడా. ఆల్కహాల్‌ను ఆడవాళ్లకు కూడా తాగాలని పిస్తుంది.

వారు కూడా చిల్ అవుదామనుకుంటారు. విమర్శి చేసేవారికి ప్రతిదీ తప్పులాగే కనిపిస్తుంటుంది. వారి గురించి నేను పట్టించుకోను.” అని పాయల్ స్పష్టం చేసింది..ఆమె పెట్టిన ఈ పోస్టుకు డేంజరస్ హీరోయిన్ నైనా గంగూలీ మద్దతు తెలిపింది. “మహిళలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఇదే సమయంలో శక్తిమంతంగానూ ఉంటారు. కాబట్టి బ్రాండ్లు వారిని వెతుక్కుంటూ వస్తాయి” అని పాయల్ కామెంట్స్‌ను సపోర్ట్ చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మల స్పందనలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.

Mannara Chopra at Sri Krishna Silks Special Wedding Collection Launch!

Anupama Parameswaran Shocking Reply To Netizen On Asking whatsapp number!