in

Payal Rajput Accuses Producer for Threatening To Ban From tollywood!

RX100, మంగళవారం చిత్రాల ద్వారా పాయల్ రాజ్ పుత్ మంచి పేరు తెచ్చుకుంది. అయితే కొందరు చిత్ర నిర్మాతల నుండి తనకు ఎదురైన వేధింపుల గురించి బయట పెట్టింది. పాయల్ రాజ్‌పుత్ రక్షణ అనే చిత్రంలో నటించింది.. అది త్వరలో విడుదల కానుంది. 2019- 2020లో చిత్రీకరించిన ఈ సినిమాకు మొదట్లో 5Ws అని పేరు పెట్టారు. అయితే ఈ సినిమా ఆలస్యంగా విడుదల అవుతోందని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

ఆమెకు ఉన్న పాపులారిటీని సద్వినియోగం చేసుకోవాలనే ఆశతో నిర్మాతలు తన బకాయిలను క్లియర్ చేయకుండా తనను ప్రమోషన్స్ కు హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా ఆమె పేరును దుర్వినియోగం చేసి, ఆమె ప్రతిష్టను దిగజార్చారు.. ఆమెను తెలుగు సినిమా నుంచి బహిష్కరిస్తామంటూ బెదిరించారని పాయల్ తెలిపింది. చెల్లింపు సమస్యలు పరిష్కారం కాని కారణంగా ఆమె అనుమతి లేదా సమ్మతి లేకుండా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారని.. తాను చట్టపరమైన చర్యలను తీసుకోవాలని అనుకుంటూ ఉన్నానని పాయల్ తెలిపింది..

teja sajja and vishwak sen to be part of tillu cube?

Bengaluru Rave Party: telugu actress Hema Tests Positive