in

pawan, mahesh, and vijay to clash for Sankranti 2022!

2022 సంక్రాంతికి ఇప్పుడే బెర్తులు ఖాయ‌మైపోయాయి. వ‌చ్చే ఏడాది ఏకంగా 4 సినిమాలు విడుద‌ల‌కు రెడీ అయ్యాయి..మ‌హేష్ బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న `స‌ర్కారు వారి పాట‌`ని సంక్రాంతి బ‌రిలో దింపాల‌న్న‌ది ప్లాన్‌. ద‌ర్శ‌క నిర్మాత‌ల టార్గెట్ కూడా అదే. మ‌హేష్ కూడా `ఈ సినిమాని ఎలాగైనా స‌రే – సంక్రాంతికే విడుద‌ల చేయాలి` అని గ‌ట్టిగా చెబుతున్నాడ‌ట‌. పైగా సంక్రాంతి మ‌హేష్ కి బాగా క‌లిసొచ్చింది. అందుకే ఈసారి కూడా ఆ సెంటిమెంట్ ఫాలో అవ్వాల‌నుకుంటున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఈ సంక్రాంతి పోటీకి సిద్ధ‌మ‌య్యాడు.

రానాతో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ అయ్య‌ప్ప‌యున్ కోషియ‌మ్ ని ఈ సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర‌బృందం కూడా అధికారికంగా ప్ర‌క‌టించేసింది. ఇక ఎఫ్ 3 ఎలానూ ఉంది. 2020 సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎఫ్ 3ని సైతం సంక్రాంతికే విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఈ మూడు తెలుగు సినిమాల‌తో పాటు విజ‌య్ న‌టించిన `బీస్ట్` కూడా సంక్రాంతికే వ‌స్తోంద‌ట‌. ఈ సంక్రాంతికి `మాస్ట‌ర్‌` తెలుగులోనూ విడుద‌లై మంచి వ‌సూళ్లు అందుకుంది. అందుకే విజ‌య్ కూడా ఈ సంక్రాంతిని మిస్ చేసుకోకూడ‌దు అనుకుంటున్నాడు.

Sumanth is Getting Married Again after 15 years!

amala paul exposes at the promotions!