పవన్ కళ్యాణ్ కోసం సెర్చ్ చేసిన విషయాలు!
పవన్ రాజకీయ ప్రయాణం, మంత్రిత్వశాఖ పేరు గురించి చాలా మంది గూగుల్లో సెర్చ్చేశారు. ముఖ్యమైన ప్రశ్నలలో పవన్ కల్యాణ్ పోర్ట్ పోలియో, ఏపీలో పవన్ కల్యాణ్ మంత్రిత్వ శాఖ, పిఠాపురం, పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాలు ఇలా సెర్చ్ లో టాప్ ప్లేసులో ఉన్నాయి. కాకినాడ ఓడరేవు, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సీజ్ ద షిప్ అంటూ దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి..
గూగుల్ సెర్చ్ లో ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ రెండో స్తానం!
దీంతో పవన్ కల్యాణ్ ఎవరు..ఆయన హిస్టరీ తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుంచి పవన్ కల్యాణ్ కీ వర్డ్ తో సెర్చ్ చేశారు. గూగుల్లో గ్లోబల్ లెవల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ సినీ నటుల లిస్టులో పవన్ కల్యాణ్ ఏకంగా వరల్డ్ వైడ్ గా 2 ప్లేసులో నిలిచాడు. దీంతో పవన్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పుకోవాలని అభిమానులు సంబురపడుతున్నారు. ఇక హీరోలు, రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కల్యాణ్ మొదటిస్థానంలో, చిరాగ్ పాశ్వాన్ రెండో స్థానంలో, ప్రధాని మోదీ మూడోస్థానంలో, చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారు..!!