ప్రముఖ నటుడు నాజర్, తనకు పెద్దగా ఇంటరెస్ట్ లేక పోయిన, తన తండ్రి కోరిక తీర్చటం కోసం నటుడు అయ్యారు, చేసేది ఏమయినా చిత్త శుద్ధితో చేయాలనీ నమ్మిన వారు కాబట్టి, నటుడుగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎప్పుడు ఎంతో హాయిగా, ప్రశాంతం గ కనిపించే నాజర్ గారి జీవితం లో పెను విషాదం చోటు చేసుకుంది, అయిన కూడా, ఆయన ఆ విషాద ఛాయలు కనిపించకుండా తన జీవితానాన్ని సాగిస్తున్నారు. చాలామంది వెండి తెర నటుల జీవితాలు రంగుల మయంగా కనిపించిన, వారి జీవితాలలో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకొని ఉంటాయి. నాజర్ గారికి ముగ్గురు కుమారులు, అందులో ఇద్దరు సినీ నటులుగా కొనసాగుతున్నారు, పెద్ద కొడుకు అయిన అబ్దుల్ ఫైజల్ హాసన్ మాత్రంఇంటికి పరిమితం అవ్వ వలసి వచ్చింది. ఎదిగిన పెద్ద కొడుకును హీరోగా తెరంగేట్రం చేయించాలి అనుకుంటున్న సందర్భంలో దురదృష్ట వశాత్తు, అబ్దుల్ ఫైజల్ హాసన్ ఘోరమయిన కారు ప్రమాదానికి గురి అయ్యాడు..
విధి చిన్న చూపు చూసింది, ప్రాణాలు దక్కాయి కానీ, జ్ఞాపక శక్తి కోల్పోయాడు, సొంత తల్లి, తండ్రి ని కూడా గుర్తించ లేడు. జీవచ్ఛవం లాగా మిగిలిన కొడుకును చూసి కుమిలిపోయారు నాజర్ దంపతులు, మనసు రాయి చేసుకొని అతని ఆలనా, పాలన చూసుకుంటున్నారు వారు. ఇంత పెను విషాదంలోనూ ఆశ్ఛర్యకరమయిన విషయం ఏమిటంటే, అబ్దుల్ ఫైజల్ హాసన్ కు హీరో విజయ్ గుర్తు ఉన్నారు, ఆయన సినిమా చూస్తే సంతోషం తో ఊగిపోతాడట. ఆ విషయం తెలిసిన విజయ్ , అబ్దుల్ ఫైజల్ హాసన్ బర్త్ డే కి వచ్చి అతనితో కొంత సమయం గడిపి వెళ్లారట. పాపం అతనికి నటుడు అవ్వాలని ఎంత తపన ఉండేదో, అందుకే తల్లి, తండ్రిని గుర్తుపట్ట లేకపోయినా, తన అభిమాన నటుడిని గుండెల్లోనే దాచుకున్నాడు. ఎందుకు విధి కొందరి జీవితాలతో ఇలా కర్కశంగా ఆడుకుంటుందో, ఆ హృదయం లేని విధికే తెలియాలి..!!