in

Mrunal Thakur To Star In Megastar Chiranjeevi’s 157th film?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాన్నాళ్ళ క్రితం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పేరుతో ఓ సెన్సేషనల్ హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ఆ సినిమాలో కథా నాయిక. మల్ళీ ఆ తరహా టైటిల్‌తో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. కాకపోతే, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ మేరకు కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే బయటకు వచ్చింది. ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవ్వొచ్చు.

ఈ సినిమా కోసం కథానాయిక ఎంపిక ప్రక్రియ షురూ అయినట్లు తెలుస్తోంది. కథానాయిక అంటే, చిరంజీవికి జోడీ కాదనీ, ఈ సినిమాలో ఓ కీలక పాత్రధారణి అనీ అంటున్నారు. ఆ పాత్ర కోసం మృనాల్ ఠాకూర్ పేరు పరిశీలిస్తున్నారట. సాయి పల్లవి కూడా దర్శకుడి దృష్టిలో వుందని అంటున్నారు. ‘జగదేక వీరుడు’ తరహాలోనే టైటిల్ వుంటుందని సమాచారం. ‘ముల్లోక వీరుడు’ అనే పేరు ప్రచారంలోకి వచ్చిందిగానీ, అది నిజం కాదట. ‘భోళాశంకర్’ సినిమా రిలీజ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కాలికి చిన్నపాటి సర్జరీ జరిగింది. దాన్నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నారు చిరంజీవి..!

Samantha and Naga Chaitanya reuniting?

trivikram to rope in sai pallavi for allu arjun?