బహు భాష గాయని, పీ.సుశీల గారు, దాదాపుగా యాభై వేల పాటలు పాడి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ కు ఎక్కిన ఆవిడకు చెమటలు పట్టించిన పాట ఒకటి ఉంది, అదే పాటో మీకు తెలుసా? పాత రోజులలో ఒక పాట రికార్డింగ్ అంటే, ఒక యజ్ఞం లాగా సాగేది. మొత్తం ఆర్కెస్ట్రా తో కలసి గాయని , గాయకులు లైవ్ లో పాట పాడే వారు, ఇందులో ఎవరు తప్పు చేసిన మళ్ళీ పాట మొత్తం మొదట నుంచి పాడ వలసి వచ్చేది. ఇప్పటి లాగా ఎవరికి టైం ఉన్నప్పుడు వచ్చి, వారి ట్రాక్ వాయించి, పాడి వెళ్లిపోయే సదుపాయం లేదు. రామ నాయుడు గారు, 1966 లో నిర్మించిన శ్రీ కృష్ణ తులాభారం సినిమా కోసం, పెండ్యాల నాగేశ్వర రావు గారి సంగీత దర్శకత్వంలో, సుశీల గారు,
” మీర జాల గలడా నా యానతి” అనే పాట రికార్డు చేస్తున్నారు. పెండ్యాల నాగేశ్వర రావు గారు ఆ పాటకు చాల సంక్లిష్టమయిన బాణీ ప్లాన్ చేసి రిహార్సల్ తరువాత రికార్డింగ్ మొదలు పెట్టారు. రికార్డింగ్ మొదలయిన తరువాత ఎవరో ఒకరో ఏదో ఒక తప్పు చేయటం, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించటం, ఇలా ఆ పాటను పూర్తి చేయటానికి 18 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. సుశీల గారి కెరీర్ లో అత్యంత సంక్లిష్టమయిన పాట ఇది. ఇప్పటికి ఆ పాటను తలచుకుంటే వళ్ళు జలదరిస్తుంది అంటుంటారు సుశీల గారు..