in

over 300 tankers of water is used for chaithu’s ‘Dhootha’!

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సిరీస్ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ .. “ఈ కథ విన్న వెంటనే నాకూ .. చైతూకి బాగా నచ్చేసింది. ఆడియన్స్ ఊహకి అందని విధంగా ఈ కథను విక్రమ్ కుమార్ నడిపించడం వల్లనే ఈ సిరీస్ ఇంతగా ఆకట్టుకుంటోంది” అని అన్నారు. “కథగా వింటే చాలా సింపుల్ కదా అనిపిస్తుంది. కానీ విక్రమ్ కుమార్ ట్రీట్మెంట్ ప్లస్ అయింది. 38 లాంగ్వేజెస్ లలో సబ్ టైటిల్స్ 240 దేశాల ప్రజలకు అందుబాటులోకి వెళ్లడం ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది.

మా బ్యానర్ పేరును ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. మరిన్ని పెద్ద ప్రాజెక్టులు చేయడానికి అవకాశం కల్పించింది” అని చెప్పారు. “ఈ కథ అంతా వర్షంలోనే నడవాలని..వర్షం కూడా ఒక పాత్ర మాదిరిగా కంటిన్యూ అవుతుందని విక్రమ్ ముందుగానే చెప్పారు. సిరీస్ అంతా పూర్తయ్యేసరికి 300లకి పైగా ట్యాంకర్ల నీళ్లను తెప్పించవలసి వచ్చింది. వర్షం ఎఫెక్ట్ వలన కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది” అని అన్నారు..!!

Pooja Hegde’s visit to director house raise to rumors!

Nayanthara to play jhanvi kapoor’s sister role?