రష్మిక కీలక పాత్రలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినా సరే.. త్రిప్తి బాగా హైలైట్ అయింది. ఆమె అందానికి, తనతో రణబీర్ చేసిన ఇంటిమేట్ సీన్లకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. యానిమల్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో త్రిప్తి ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమెకు అవకాశాలకు కూడా లోటే లేదు. భూల్ భులయియా-2తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంది త్రిప్తి.
only 40 lakhs for animal sensation Tripti Dimri!
ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. త్రిప్తికి యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేసేటప్పటికి త్రిప్తి ఎవరో ప్రేక్షకులకు తెలియదు. కొత్తమ్మాయి.. పైగా తక్కువ నిడివి ఉన్న పాత్ర. కాబట్టి తక్కువ పారితోషకానికే ఒప్పుకుంది. కానీ యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్టయి త్రిప్తి పేరు మార్మోగేలా చేసింది..!!