in

okka rojulo assistant director ga marina vamsy!

ది గోదావరి తీరా పసలపూడి గ్రామం , అందులో ఒక 16 ఏళ్ళ కుర్రాడు రచనలు చేయడం మొదలు పెట్టాడు , తన మొదటి కథ తరువాత , మంచు పల్లకి ,కర్మ సాక్షి అని రెండు నొవెల్స్ కూడా రాసేసాడు . ఆ నొవెల్స్ చుసిన ఒక వెల్ విషర్ నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది అని అతని తీసికెళ్ళి మద్రాస్ లో వదిలాడు .తాను రాసిన నొవెల్స్ తీసికుని వీ.మధుసూధనా రావు అనే పెద్ద డైరెక్టర్ ని కలిసాడు . ఆ నొవెల్స్ రాసింది మీసాలు కూడా సరిగ్గా రాని ఈ కుర్రాడే , అని నమ్మలేక , అతనికి ఒక 20, రెండు రూపాయల నోట్లు ఇచ్చి కేసినో థియేటర్ లో ఫ్రెండ్స్ అనే సినిమా నడుస్తుంది , సినిమా చూసి , దాని వన్ లైన్ ఆర్డర్ రెడీ చేసుకొని వన్ వీక్ తరువాత తనను కలవమని చెప్పి పంపేశారు . వన్ లైన్ ఆర్డర్ అంటే ఏమిటి అనే వివరణ కూడా మధుసూధనా రావు గరే చెప్పి పంపించారు . అతను అదే రోజు ఫ్రెండ్స్ అనే మూవీ చూసి , వన్ లైన్ ఆర్డర్ తాయారు చేసుకొని మధుసూధనా రావు గారి ముందు ఉన్నాడు .ఇతన్ని చుసిన మధుసూధన రావు గారు నిన్ను వన్ వీక్ తరువాత రమ్మంటే మల్లి ఇప్పుడే వచ్చావు ఏమిటీ అని అడిగారు . తాను తాయారు చేసిన ఫ్రెండ్స్ మూవీ వన్ లైన్ ఆర్డర్ ని ఆయనకు చూపించాడు , అది చుసిన డైరెక్టర్ గారు , అతన్ని , కార్ లో షూటింగ్ స్పాట్ కి తీసికుని వెళ్లిపోయారు . స్పాట్ కు వెళ్లిన కుర్రాడు అసిస్టెంట్ డైరెక్టర్ గ తన మొదటి క్లాప్ ను ఎన్ టి ఆర్ గారి మీద చేయడం జరిగింది . ఆ మూవీ పేరు ఎదురీత , ఆ కుర్రాడి పేరు వంశి . తరువాత విశ్వనాధ్ గారు , బాపు గారు ఇంక భారతి రాజా వద్ద అసిస్టెంట్ గ పని చేసి మంచు పల్లకి అనే మూవీ తో డైరెక్టర్ గ అవతరించి , సితార , అన్వేషణ వంటి సినిమా లతో గుర్తింపు తెచ్చుకొని , లేడీస్ టైలర్ , చెట్టుకింద ప్లీడర్ ఇంక ఏప్రిల్ 1st విడుదల వంటి హిట్స్ తో తనకు అంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్నారు .

Leave a Reply

jigelu rani turns into a singer!

F CUBE ‘S V KRISHNA REDDY’