సినీ దర్శకులు చాల మంది ఉత్తమ దర్శకులుగా నంది అవార్డులు అందుకొని ఉంటారు, కానీ ఒక్క రాఘవేంద్ర రావు గారు మాత్రం తాను దర్సకత్వం వహించిన ఒక చిత్రానికి, నృత్య దర్శకుడు లేకుండా తానే చిన్న చిన్న నృత్య భంగిమలతో చిత్రాన్ని, చిత్రంలోని పాటలను విజయవంతం చేసారు. విజయ వంతం చేయటమే కాదు ఉత్తమ నృత్య దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఎప్పుడు బిరియాని తింటే ఏం బాగుంటుంది, అపుడపుడు పులిహోర కూడా తినాలి అన్నట్లు, అప్పటికే అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు తీసిన రాఘవేంద్ర రావు గారికి , పులిహోర తినాలనిపించింది, తన కెరీర్ మొదట్లో తీసిన జ్యోతి వంటి చిన్న సినిమా తీయాలనిపించింది.
వెంటనే సత్యానంద్ గారు కథ రెడీ చేసారు, హీరో గ శ్రీకాంత్ ని ఎంపిక చేసి సినీ పరిశ్రమ వారిని ఆశ్చర్య పరిచారు. చిన్న బడ్జెట్ తో సినిమా చేయాలనుకున్నారు, అశ్వని దత్తు, అల్లు అరవింద్ తోడయ్యారు, నృత్య దర్శకుడు అవసరం లేకుండానే, తానే నృత్య దర్శకత్వం వహించిన చిత్రం 1995 లో వచ్చిన ” పెళ్లి సందడి ” . సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది చాల నంది అవార్డులు వచ్చాయి, రాఘవేంద్ర రావు గారికి ఉత్తమ నృత్య దర్శకుడు గ నంది అవార్డు వచ్చింది. తెలుగు సినీ చరిత్రలో ఒక దర్శకుడు, ఉత్తమ నృత్యదర్శకుడుగా నంది అవార్డు అందుకోవటం ఒక్క రాఘవేంద్ర రావు గారికే చెల్లింది.