
డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ మొదటి సినిమా” గమ్యం “కి ఒక్క పైసా కూడా తీసుకొకుండా అన్ని పాటలు వ్రాసిన సిరివెన్నెల, ఎందుకు ఆయన ఆలా చేసారో తెలుసా? క్రిష్ ఒక ఫార్మసీ గ్రాడ్యుయేట్ మంచి సినిమా తీయాలని ఒక కధ రెడీ చేసుకొని సిరివెన్నెల గారిని కలిసాడు, ఆ కధ పేరు సిధార్థ, ఆ కథ సినిమా తీయడానికి కావలసిన మార్పులు సూచించారు సిరివెన్నెల గారు, అక్క్కడ నుంచి మాయం అయిన క్రిష్ తొమ్మిది నెలలు శ్రమించి తయారు చేసుకున్న కథ తో సిరివెన్నెల గారి ముందు ప్రత్యక్షం అయ్యాడట, అది చదివిన సిరివెన్నెల గారు ఇదిరా కథ అంటే, అని మెచ్చుకున్నారు. గురువు గారు నా దగ్గర పెద్దగా డబ్బు లేదు నాకు ఒక పాట రాసి పెట్టండి అని అడిగారట, ఒక మనిషి గురించి చెప్పాలి అనుకుంటున్న మనిషికి ఈ మనిషి ఒక్క పాట ఏమిటి అన్ని పాటలు రాస్తాను , నాకు ఒక్క పైసా కూడా వద్దు అని అన్ని పాటలు రాసారు. సినిమా అంత ప్రయాణం సినిమాకు పేరు మార్చి గాలిపటం అని పేరు పెట్టాలి అని అనుకోని, గమ్యం అని పేరు పెట్టి రిలీజ్ చేసారు. సినిమా నచ్చిన సిరివెన్నెల గారు మెచ్చుకున్నారు, ఒక సూర్యుడిలా నువ్వు ఉదయిస్తున్నావు అని నేనొక కోడిలా ముందే కూస్తున్నాను నువ్వు గొప్ప డైరెక్టర్ అవుతావు అని చెప్పి గట్టిగ హత్త్తుకున్నారట..