
గిరిబాబు గా ప్రసిద్ధి చెందిన యర్రా శేషగిరి రావు పరిచయం అఖ్ఖరలేని విలక్షణ నటుడు హీరోగా, విలనుగా, కమెడియనుగా, క్యారెక్టర్ నటుడిగా 700 చిత్రాలు నటించారు.1973 లో జగమే మాయ అనే చిత్రం తో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన గిరిబాబు గారు తన సుదీర్ఘ సినీ ప్రయాణం లో దాదాపుగా అందరి దర్శకులతో నటించారు ఒక్క విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో తప్ప.ఇది ఏదో యాదృచ్చికంగ జరిగినది కాదు, దానికి ఒక కారణం ఉన్నది అంటారు గిరిబాబు గారు..విశ్వనాధ్ గారు ఆదుర్తి సుబ్బా రావు గారి వద్ద అసిస్టెంట్ గ పని చేస్తున్న రోజులలో, ఆదుర్తి గారు దర్శకత్వం వహిస్తున్న “గాజుల కిష్టయ్య ‘ అనే చిత్రం లో కృష్ణ గారు హీరో, గిరిబాబు గారు ఆయన సహా నటుడు, ఆదుర్తి గారి ఆరోగ్యం బాగోక విశ్వనాధ్ గారు డైరెక్ట్ చేయవలసి వచ్చింది. ఆదుర్తి సుబ్బా రావు గారు నటుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వారి వారి పంధా లో నటింపచేసే వారు, విశ్వనాథ్ గారు ఆదుర్తి వారికీ పూర్తి భిన్నం, తాను నటించి చూపించి ప్రతి నటుడిని ఇలాగె నటించమని చెప్పే వారు. అప్పటివరకు తన పంధా లో నటించిన గిరిబాబు గారు, సార్ మీరు చెప్పినట్లు చేస్తే ఇప్పటి వరకు నేను చేసిన నటనకు, పాత్ర ఔచిత్యానికి, తేడా వస్తుంది, నేను పాత పద్దతి లోనే నటిస్తాను అన్నారట, డైరెక్టర్ చెప్పినట్లు చేయటమే మీ డ్యూటీ అన్నారట విశ్వనాధ్ గారు, కానీ గిరిబాబు గారు పాత్ర ఔచిత్యం చెడిపోతింది అని ఆలోచనలో పడ్డారు, చివరకి నేను ఆలా చేయను సార్ అని ఒకింత గట్టిగానే సెట్ లో అందరి ముందు చెప్పారట, దానికి మీ ఇష్టం ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకొనేందుకు డైరెక్టర్ ఎందుకు అని మౌనం వహించారట విశ్వనాధ్ గారు . ఈ సంఘటన తరువాత డైరెక్టర్ గ మారిన విశ్వనాధ్ గారు గిరిబాబు గారికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదో, మరి గిరిబాబు గారికి తగ్గ క్యారెక్టర్ విశ్వనాధ్ గారి స్క్రిప్ట్ లో లేదో గానీ గిరిబాబు గారు మాత్రం విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో నటించ లేదు.

