
నటి సౌందర్య గారు తన కెరీర్ ప్రారంభ దశలో ఒక రోల్ చేయటానికి ఒప్పుకొని, తరువాత ఆ రోల్ చేయటానికి భయపడి జ్వరం తెచ్చుకొన్న సంఘటన ఒకటి జరిగింది. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లో నటించి హీరోయిన్ గ తన కెరీర్ ఎస్టాబ్లిష్ అవుతున్న టైం లో తన గాడ్ ఫాదర్ వంటి డైరెక్టర్ కి యమలీల చిత్రం లో అలీ సరసన హీరోయిన్ గ నటించటానికి ఒప్పుకున్నారు. అది తెలిసిన ఇండస్ట్రీ లో కొంత మంది సౌందర్య గారిని భయపెట్టారు, మంచి కెరీర్ ఉన్న నువ్వు ఈ స్టేజి లో అలీ ప్రక్కన నటిస్తే, పెద్ద హీరోలు ఎవరు నీ ప్రక్కన నటించారు ఇంతటితో నీ కెరీర్ ఎండ్ అంటూ భయపెట్టేసారు. కృష్ణా రెడ్డి గారికి నో చెప్పలేక, తన ఫ్యూచర్ గురించి భయపడిన సౌందర్య గారు జ్వరం తో మంచం ఎక్కారు. విషయం తెలుసుకొన్న సౌందర్య నాన్న గారు, కృష్ణా రెడ్డి గారికి విషయం చెప్పారట,