1974 లో కౌముది పిక్చర్స్ వారి ” కోడె నాగు” చిత్రంలో నిర్మాత ఏం.ఎస్.రెడ్డి గారిని బతిమాలి, బామాలి, పోరాడి హీరో వేషం సంపాదించిన శోభన్ బాబు. కన్నడ లో సూపర్ హిట్ అయిన చిత్రం” నాగార హు ” ఆ చిత్రం హక్కులు కొన్న ఏం.ఎస్.రెడ్డి గారు కృష్ణ గారిని హీరోగా అనుకున్నారు. కానీ ఆ చిత్రం చూసిన శోభన్ బాబు గారు ఆ పాత్ర మీద మక్కువ పడ్డారు, ఓ రోజు ఉదయాన్నే ఏం.ఎస్. రెడ్డి గారు ఆఫీస్ లో అడుగు పెట్టె సరికి అక్కడ శోభన్ బాబు గారు కనిపించరు. ఏందయ్యా హీరో ఇలా వచ్చావు అనగానే శోభన్ బాబు గారు తన మనుసులో కోరిక ఆయనకు చెప్పారు.” అరే అట్టన, నాది చిన్న బడ్జెట్ సినిమా, నువ్వేమో రెండు లక్షలు తీసుకుంటున్నావంటా గదా” అన్నారు, మీరు ఎంత ఇచ్చిన పరవాలేదు అన్నారట శోభన్ బాబు గారు,”
అది సరేలే నువ్వు సెట్లోకి రాగానే నిర్మాత గూడా లేసి నిలబడాలంట గదా , దీని పాసుగల అన్నారంట”, మీరు పెద్ద వారు నన్ను ఒరే అన్న పరవాలేదు అన్నారట శోభన్ బాబు గారు. రెడ్డి గారి మనసులో కృష్ణ గారు ఉండటం వలన అయన ఏదో ఒక విధంగా శోభన్ బాబు గారికి కాదు అని చెప్పాలి అనుకున్న కూడా, శోభన్ బాబు గారు అడుగుతున్న తీరు చూసి కాదు అని చెప్పలేక పోయారట. సరేలే డైరెక్టర్ కె.ఎస్.ప్రకాష్ రావు ని అనుకున్నాము ఆయనతో కూడా ఒక మాట చెప్పు అన్నారట. ఒక పాత్ర కోసం నటుడు పడే తపనకు ఇదో నిదర్శనం అని చెప్పుకోవచ్చు. శోభన్ బాబు గారి కెరీర్ లో కోడె నాగు చిత్రం లో ఆయన నటించిన నాగ రాజు పాత్ర ఒక మైలురాయి గ నిలిచింది.