in

‘bheemla nayak’ and ‘f3’ out from sankranti race!

ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా హీరోలు న‌టించిన భీమ్లా నాయ‌క్‌, అలాగే.. వ‌రుణ్ తేజ్‌- వెంక‌టేష్ హీరోలు గా న‌టించిన ఎఫ్ 3 సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఈ విష‌యాన్ని ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యామ్ సినిమాలు మాత్ర‌మే సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానున్నాయ‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ న‌టించిన భిమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతుంది.

అలాగే.. ఎఫ్ 3 సినిమా కూడా వాయిదా ప‌డుతుంద‌న్నారు దిల్ రాజ్‌. దీంతో ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ సినిమా ఏప్రిల్ 29 కి మారిందని.. జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కు రానుందని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఈ సారి సంక్రాంతి బ‌రి లోకేవ‌లం ఆర్ ఆర్ ఆర్‌, రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీలే ఉంటాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఇక దిల్ రాజ్ తాజా ప్ర‌క‌ట‌న తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ కు గుర‌య్యారు.

Nani reveals he tried 15 different looks for ‘Shyam Singha Roy’!

oka paathra kosam natudu pade thapanaku idho nidarshanam!