in

oka kalakarudi sathaa yento neerupinchina lakshmi bhupal!

క్ష్మి భూపాల్ సినీ మాటల,గేయ, మరియు స్క్రీన్ ప్లే రచయిత, తనకంటూ ఒక ప్రత్యేక శైలి తో మంచి రచయిత గ ముందుకు సాగుతున్నారు. జర్నలిస్ట్ గ కెరీర్ ప్రారంభించి, సినీ మాటల రచయిత గ మారారు, మాటల రచయిత గ ఉన్న లక్ష్మి భూపాల్ గారు గేయ రచయిత గ ఎలా మారారు అనేది ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ. ఒక డైరెక్టర్ రెచ్చగొడితే పట్టుదలకు పోయి పాట రాసిన వైనం, అప్పటి వరకు తాను పాట రాయగలను అని అనుకోలేదు, అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు.అవి లక్ష్మి భూపాల్ గారు, కృష్ణవంశి గారి ”చందమామ ” చిత్రానికి మాటల రచయిత గ పని  చేస్తున్న రోజులు, హంపి లో జరుగుతున్న ఔట్డోర్ షూటింగ్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ స్పాట్ లోనే ఉంటూ తన పని తోపాటు, ఒక అసోసియేట్ లాగా అన్ని విషయాలు చూసుకుంటూ ఉండే వారు. తరువాత జరగవలసిన సాంగ్, రైటర్ ఇచ్చాడా లేదా అంటూ పదే, పదే కృష్ణవంశీ గారిని అడిగారట ఇస్తారులే నీకెందుకు అంత టెన్షన్ పెద్ద రాసేవాడిలాగా అన్నారట యాదృచ్చికంగ , మ్యూజిక్ డైరెక్టర్ ను అడిగి ట్యూన్ తీసుకున్న లక్ష్మి భూపాల్ గారు సెట్ లో కూర్చొని పాట రాసి కృష్ణవంశీ గారికి చూపించారు,ఆశ్చర్యపోయిన వంశి గారు, ఆ లిరిక్ నే షూట్ చేసారు. అదే “సక్కుబాయినే” అనే గోదావరి జిల్లాల సంస్కృతి ప్రతిబింబించే భోగం మేళం పాట.నేటివిటీ కోసం కొన్ని వాడుక పదాలను పాటలో వాడారు, అవి కొన్ని సెన్సార్ కట్ కు గురి అయ్యాయి, మెచ్చుకొన్న వంశి గారే, భూపాల్ గారికి అక్షింతలు కూడా వేశారు, ఎందుకంటె ఇంత వరకు వంశి గారి చిత్రాలలో పాటలకు సెన్సార్ కట్ పడలేదు. ఇక ఆ పాట ఎంత పాపులర్ అయింది మనందరికీ తెలిసిన విషయమే.

EESHA REBBA SIZZLES IN BLACK !

ram charan realizes his mistake!