భారతీయ సంస్కృతికి అద్దం పడుతూ ఎన్నో సంగీత ప్రధానమయిన చిత్రాలు నిర్మించిన డైరెక్టర్ విశ్వనాధ్ గారు, ఒక్క పౌరాణిక చిత్రం కూడా నిర్మించ లేదు. వాల్మీకి జీవితం ఆధారం గ ఒక చిత్రం నిర్మించే అవకాశం వచ్చిన కూడా, ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఒక గుజరాతి నిర్మాత వాల్మీకి జీవితం ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మించ దలచి, సంగీత దర్శకుడిగా, పండిట్ రవి శంకర్ గారిని ఎన్నుకొని, వారిని సంప్రదించగా, సంగీత దర్శకత్వం వహించడానికి ఒప్పుకున్న అయన, దర్శకుడు ఎవరు అని అడిగారట, ఇంకా నిర్ణయించలేదు అన్న నిర్మాత మాట విన్న పండిట్ రవి శంకర్ గారు,
శంకరాభరణం నిర్మించిన దర్శకుడిని పెట్టుకోమని చెప్పారట. ఆ నిర్మాత విశ్వనాధ్ గారిని కలసి, రవి శంకర్ గారు అయన పేరు సూచించిన విషయం చెప్పగానే, ఎంతో సంతోషించిన విశ్వనాధ్ గారు, నిర్మాత చెప్పిన కథ విన్న తరువాత, దర్శకత్వం నిర్వహించటానికి కొంత సందేహించారట. పౌరాణిక చిత్రాలు నిర్మించిన అనుభవం లేకపోవటంతో, అయన ఆ చిత్రాన్ని అంగీకరించలేదు. భారతీయ ప్రేక్షకులు ఒక గొప్ప దృశ్య కావ్యం చూసే అవకాశం కోలుపోయారు..