పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘ఓజీ’ తర్వాత ప్రియాంక అరుల్ మోహన్ సంతకం చేసిన సినిమా ఇదేనని సమాచారం. ‘ఓజీ’ కాకుండా తమిళంలో కెవిన్ సరసన ఆవిడ ఓ సినిమా చేస్తోంది. నాగార్జున వందో సినిమాకు రెడీ అయ్యే సమయంలో దర్శకుడు రా కార్తీక్, నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు..
కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటి వరకు పదికి పైగా సినిమాలు చేశారు. తెలుగులో పవన్ కళ్యాణ్, నాని… తమిళంలో ధనుష్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేశారు. ఓటీటీ కోసం ఆవిడ సినిమా చేస్తుండటం ఇదే మొదటిసారి. ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుండటం కూడా ఇదే తొలిసారి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి..నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు రా కార్తీక్ కలిసి సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో కొంత షూటింగ్ చేశారు..!!