in

Official: Love Story OTT Streaming Date

సెప్టెంబర్ 24న విడుదలైన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా.. ఇంకా పలు హౌస్ ఫుల్ కలెక్షన్స్‏తో దూసుకుపోతుంది. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫాంలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో ఆహాలో అక్టోబర్ 22 నుంచి లవ్ స్టోరీ సినిమమా స్ట్రీమింగ్ కానున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా లవ్ స్టోరీ. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది.  అమెరికాలో 224 లొకేష‌న్స్‌లో ల‌వ్‌స్టోరి ప్రీమియ‌ర్స్ వేస్తే, 3,07,103 డాల‌ర్స్  వసూలు చేసింది.  ఇక ఫస్ట్ డే 144 లొకేష‌న్స్‌ల్లో 85,232 డాల‌ర్స్  కలెక్షన్లు రాబట్టింది.  మన దేశ కరెన్సీలో లవ్ స్టోరీ యుఎస్ లో మొదటి రోజు రూ.2.9 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపినింగ్ కలెక్షన్ల రాబట్టిన సినిమాగా నిలిచింది.

Samantha’s Hair Stylist Preetham Breaks Silence On His Rumoured Affair!

adah sharma latest hot stills!