సీనియర్ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్స్, కే. రాఘవ గారి జీవితం అంత ఒక పోరాటమే. ఎవరి ఆఫీస్ లో అయితే బాయ్ గ పని చేసారో అయన పేరు మీద ఏర్పాటు చేసిన ఓక అవార్డు ను సాధించిన ఘనుడు అయన. ఎనిమిది ఏళ్ళ వయసులో ఇంటినించి పారిపోయి కలకత్తా చేరిన రాఘవ గారు,అనేక స్టూడియోలలో పని చేస్తూ, విజయవాడ మారుతీ టాకీస్ లో కామెంటేటర్ అయిన కస్తూరి శివ రావు కు కాఫీ, సోడా లు అందించే పని కొంత కాలం చేసిన తరువాత, మద్రాస్ చేరిన రాఘవ గారు, తెలుగు సినీ పితామహుడు అయిన రఘుపతి వెంకయ్య గారి ఆఫీస్ లో బాయ్ గ చేరి కొంతకాలం పని చేసారు,
ఆ తరువాత ప్రొడక్షన్ బాయ్ గ,స్టంట్ మాస్టర్ గ పని చేసారు. కాలక్రమం లో నిర్మాత గప్రతాప్ ఆర్ట్స్ అనే సంస్థ స్థాపించి, 30 చిత్రాలు నిర్మించారు, దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ వంటి దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేసారు. సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం సేవలు అందించినందుకు ఆయనకు ప్రతిష్టాత్మకం అయినా రఘుపతి వెంకయ్య అవార్డు ప్రధానం జరిగింది. ఎవరి వద్ద అయితే ఆఫీస్ బాయ్ గ పని చేసారో, వారి పేరు మీద ఏర్పాటయిన అవార్డు సాధించటం నిజం గ చాల అరుదయిన సంఘటన.