
విధి బలీయం, మనిషి గమ్యం నిర్దేశించేది విధి అని అంటారు పెద్దలు, మనిషి ఎదో సాధించాలని ఎంతో తాపత్రయం పడతాడు కానీ తనకు యెంత ప్రాప్తం ఉందొ, ఏది పొందాలని రాసి ఉందొ అదే దక్కుతుంది. దీనికి చక్కని ఉదాహరణ మేక్ అప్ మాన్, పీతాంబరం గారి జీవిత ప్రయాణం.తమిళ్తెలుగు భాషల దిగ్గజ నటులు ఎం.జి.ఆర్, ఎన్.టీ.ఆర్ ల కు పర్సనల్ మేకప్ మాన్ గ దశాబ్దాల పాటు కొన సాగిన పీతాంబరం గారు మొదట మేకప్ ఆర్టిస్ట్ కాదు.మ్యూజిక్ డైరెక్టర్ కే.వి.మహదేవన్ గారి వద్ద అసిస్టెంట్ గ చేరిన వారు, తరువాతి కాలం లో కాస్ట్యూమ్ డిసైనర్ కి అసిస్టెంట్ గ చేరారు.కానీ విధి అయన ను గమ్యం వయిపు నడిపించు క్రమం లో, వారి గమ్యం బెంగాల్ నుంచి వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ హరి బాబు రూపం లో ఎదురు అయింది.హరి బాబు వద్ద మేకప్ మెళకువలు నేర్చుకున్న పీతాంబరం గారు 1945 లో వాహిని స్టూడియోస్ లో జాయిన్ అయ్యారు. పాతాళ భైరవి సినిమా లో ఎస్.వి.ఆర్ ను 105 సంవత్సరాల మలయాళ మాంత్రికుడిగా మార్చి, మేకప్ మాంత్రికుడిగా గుర్తింపు పొందారు. ఎం.జి.ఆర్ ను అందాల రాకుమారుడిగా, ఎన్.టీ.ఆర్ ను రాముడిగా, కృష్ణుడిగా ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయే విధంగా వారి రూపాలను తీరిచి దిద్దిన రూప శిల్పి గ ఎంతో పేరు సంపాదించుకున్నారు.హిందీ హీరోలు అయినా అశోక్ కుమార్, దిలీప్ కుమార్ వంటి నటులకు కూడా అయన మేక్అప్ మాన్ గ పని చేసారు. 1950 కాలం లో సొంత కారు కలిగిన కొద్దీ మంది లో పీతాంబరం గారు ఒకరు.తరువాతి కాలం లో నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం పరాజయం చెంది నష్టాలు తెచ్చిపెట్టింది, అందులో నుంచి బయట పడేందుకు తన ఇంటిని అమ్మటానికి సిద్ధ పడిన పీతాంబరం గారి కోసం ఎం.జి.ఆర్. అండ్ ఎన్.టి ఆర్. ఇద్దరు పోటీ పడి కాల్ షీట్స్ ఇఛ్చి ఆయనను నష్టాల నుంచి బయట పడేసారు. చంద్రముఖి డైరెక్టర్ పి. వాసు గారు, పీతాంబరం గారి కుమారుడే. ఎం.జి.ఆర్ మరణం ఎన్.టి.ఆర్.రాజకీయ ప్రవేశం తరువాత అయన కూడా సినిమా లు తగ్గించుకున్నారు.1962 లో ప్రారంభం అయినా ఆయన సినీ ప్రయాణం 1982 వరకు కొనసాగింది,ఫిబ్రవరి 21 , 2011 ఆయన భూలోక ప్రయాణం.

