
యెన్.టి.ఆర్. గారి అడవి రాముడు సినిమా 1977 లో రిలీజ్ అయింది సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. ఒక పదేళ్ల కుర్రాడు ఇప్పటి హాస్య నటుడు అలీ గారు, యెన్.టి.ఆర్. గారి వీర అభిమాని ప్రతి రోజు థియేటర్ కు వెళ్ళటం టికెట్ దొరకక తిరిగి రావటం, తీవ్రమయిన నిరాశ, ఎలాగయినా సినిమా చూసి తీరాలి, కానీ ఎలా అని ఆలోచించాడు, మరుసటి రోజు లేడీస్ క్యూ దగ్గర కాపు కాసి ఇద్దరు , ముగ్గురు లేడీస్ ని రిక్వెస్ట్ చేసాడు టికెట్ తెచ్చిపెట్టమని ఎవరు కనికరించలేదు,మళ్ళీ నిరాశ, టికెట్ తెచ్చి ఇవ్వనందుకు వాళ్ళను తిట్టుకొంటూ వెళ్లి పోయారు, మరుసటి రోజు ఒక ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది, మళ్ళీ లేడీస్ క్యూ దగ్గర ప్రత్యక్షం అయ్యాడు, ఈ సారి మాటలు లేవు సైగల తో మూగ వాడిలా టికెట్ తెచ్చి ఇవ్వమని వాళ్ళ వెంట పడ్డాడు, చివరకు ఇద్దరు లేడీస్ పాపం మూగ వాడు అని దయ తలచి టికెట్ తెచ్చి ఇచ్చారు, థియేటర్ లో వారి పక్కనే కూర్చొని సినిమా చూస్తున్న మాస్టర్ అలీ సినిమా లో లీనం అయి పోయాడు, విజిల్స్ వేస్తూ పెద్దగా కేకలు వేయటం చేసే సరికి, తాము టికెట్ తెచ్చి ఇచ్చిన వాడు మూగ వాడు కాదు అని పక్కన కూర్చున్న వాళ్లకు అర్ధం అయింది, ఇంటర్వల్ లో వాళ్ళు పలకరిస్తే మరిచి పోయిన మూగ అలీ వాళ్ళతో మాట్లాడేసాడు, అందులో ఒకావిడ చెంప ఛెళ్ళు మనిపించి, వేలెడు లేవు అప్పుడే ఇన్ని అబద్ధాలా అంటూ తిట్టిపోసింది. సినిమా అంటే ఉన్న ఆ పిచ్చ్చ ఆయనను సినీ రంగం వైపు నడిపించింది. కామెడీ కింగ్ ను చేసింది.

