
మీరా చోప్రా వివాదంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ తప్పేలా లేదు. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ మారిన ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మీరా చోప్రా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్స్ ని సైబర్ పోలీసులు గుర్తించారు. గుర్తించిన వారి అడ్రెస్స్ లు పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. సదరు అభిమానుల గుర్తింపు పూర్తి అయిన వెంటనే వీరిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ఇప్పటికే వీరిపై కఠిన చట్టాల క్రింద కేసులు నమోదు అయ్యాయి. వీరు చేసిన నేరం నిరూపణ అయితే కఠిన శిక్షలు పడడం ఖాయం అని న్యాయ నిపుణులు చెవుతున్నారు.వీరిలో కొందరు ఇప్పటికే తమ ట్విట్టర్ అకౌంట్స్ డిలీట్ చేసుకున్నారు.

