నిజానికి శాండల్ వుడ్ పేరు అందరి నోట్లో నానేలా చేసిన సినిమా ‘కే జి ఎఫ్: చాప్టర్ 1’. కన్నడ సినిమాలకు క్రేజ్ పెరిగింది ఈ సినిమా సక్సెస్ తర్వాత అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘కే జి ఎఫ్: చాప్టర్ 2’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
అయితే ఈ సినిమా ని డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి బోలెడు ఓటీటీ ఆఫర్లు రాగా తాజాగా ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ ఏకంగా ఈ సినిమా దర్శక నిర్మాతలకి 255 కోట్ల ఆఫర్ చేసిందట. మరి ఈ డీల్ కుదుర్చుకుని సినిమాని దర్శక నిర్మాతలు ఓ టి టి ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేస్తారా లేక థియేటర్లలోనే విడుదల చేస్తారా అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దేశంలోని చాలా వరకూ థియేటర్లలో 50% ఆక్యూపెన్సీ మాత్రమే ఇవ్వడంతో దర్శకనిర్మాతలు కూడా ఓటిటి నే మేలు అని అనుకుంటున్నారు కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది.