in

not Ambani or Adani, akshay kumar is the highest taxpayer!

బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోగా పేరు దక్కించుకున్న అక్షయ్‌ కుమార్‌ ఇప్పుడు దేశంలోనే అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు. అంబానీ, అదానీలను మించి అక్షయ్ కుమార్‌ పన్ను చెల్లిస్తున్నాడు. 2021 – 2022 ఆర్థిక సంవత్సరం లో రూ.29.5 కోట్ల పన్నును చెల్లించారు. ఆయన రూ.486 కోట్ల ఆదాయాన్ని ఆయన చూపించారు. బాలీవుడ్‌ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అక్షయ్‌ కుమార్‌ పెద్ద ఎత్తున కమర్షియల్‌ యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు.

అందుకే ఆయన ఆదాయం బాలీవుడ్‌ స్టార్స్ తో కాకుండా హాలీవుడ్‌ స్టార్స్ తో పోటీ పడుతుందని కామెంట్స్ వస్తున్నాయి.ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల వ్యక్తిగత ఆదాయాలు తక్కువగా ఉంటాయి. వారి కంపెనీ ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అంబానీ, ఆదానీల కంటే కూడా అక్షయ్‌ కుమార్ వ్యక్తిగత ఆదాయం ఎక్కువగా ఉంది. వ్యక్తిగత ఆదాయం అత్యధికంగా ఉన్న భారతీయుడు అక్షయ్‌ కుమార్ అంటూ తాజా నివేదికల ద్వారా వెళ్లడయింది..!!

here’s the reason why Kiara Advani Wishes To Get Pregnant!

LORD VENKATESWARA OF SILVER SCREEN!