in

no film stars in big boss telugu season 5!

బిగ్ బాస్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ 4 సీజ‌న్లు జ‌రిగాయి. 5వ సీజ‌న్ ఆదివారం రాత్రి అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ సీజ‌న్‌లో మొత్తం 16మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. వాళ్ల‌లో చాలామంది యూ ట్యూబ్ ద్వారా పాపుల‌ర్ అయిన‌వాళ్లే. మిగిలింది బుల్లి తెర స్టార్లు. అయితే… ఈసారి సినీ రంగం నుంచి ఒక్క‌రికి కూడా చోటు ద‌క్క‌లేదు. సినిమా స్టార్లెవ‌రూ ఈ సీజ‌న్‌లో క‌నిపించ‌క‌పోవ‌డం పెద్ద లోటే. గ‌త నాలుగు సీజ‌న్లోనూ సినిమా వాళ్ల‌దే హ‌వా ఎక్కువ‌. శివ బాలాజీ, వ‌రుణ్ సందేశ్‌, ముమైత్ ఖాన్‌, న‌వ‌దీప్‌,

అర్చ‌న‌, దీక్షాపంత్‌, ధ‌న్ రాజ్‌, సంపూర్ణేష్ బాబు, హేమ లాంటి సినీ సెల‌బ్రెటీలు క‌నిపించారు. గ‌త రెండు మూడు సీజ‌న్లుగా సినిమా వాళ్ల ప్ర‌భావం త‌క్కువే ఉన్నా, వాళ్ల సంఖ్య తీసి పారేయాల్సిన విధంగా లేదు. ఈసారి మాత్రం సినిమా వాళ్ల‌కుల చోటు ద‌క్క‌లేదు. బ‌హుశా.. సినిమా వాళ్లే ఈ షోలో పాల్గొన‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదేమో..? ఎందుకంటే.. దాదాపు 100 రోజుల పాటు సాగే షో ఇది. ఇన్ని రోజులు సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉండ‌డం వాళ్లకు ఇష్టం ఉండ‌క‌పోవొచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా త్వ‌ర‌లో సినిమా స్టార్లెవ‌రైనా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

Intense romance between Akash Puri and his love!

Anupama Parameswaran latest photoshoot!