సినిమా పేరుతో చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేశామని అన్నారు మంత్రి పేర్ని నాని. చట్ట సవరణతో ఏపీలో సినిమా టికెట్ల విక్రయం మొత్తం ఆన్‌లైన్ ద్వారా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. టికెట్స్ సులభంగా పొందడంతో పాటు అందరికీ సౌలభ్యంగా ఉండేలా ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ తీసుకొస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఇకపై సినిమా ఏదైనా టికెట్ ఒకటే రేటు ఉంటుందన్నారు. పదకొండు వందల సినిమా హాళ్లల్లో వినోదం అందరికీ అందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్ ఎలా ఉండాలనేదానిపై స్టేక్ హోల్డర్స్ తో చర్చలు జరుపుతున్నాయన్నారు. అలాగే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, రోజుకు 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు.