in

Nivetha Pethuraj feels happy to play soft-natured girl!

మిళ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల నటి నివేదా పేతురాజ్‌. ఇక ‘మెంటల్‌ మదిలో’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందంతో తెలుగు కుర్రకారుకు బాగా చేరువైందీ చిన్నది. అనంతరం అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ‘అల వైకుంఠపురం’ చిత్రంలో సైడ్‌ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు.. విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘పాగల్‌’ సినిమాలో నటించిందీ అమ్మడు. ఈ సందర్భగా ఈ అమ్మడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి మిగలాలని, అంతకు మంచి తనకు వేరే ఏ అంచనాలూ ఉండవని చెప్పుకొచ్చింది నివేదా. ఇక పాగల్‌ సినిమా కథను దర్శకుడు రెండేళ్ల క్రితం చెప్పాడన్న నివేదా.. కథ వింటున్నప్పుడే కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రేమలో ఉన్న వారంతా ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారని చెప్పింది. ఈ సినిమాలో తాను సీరియస్‌ రోల్‌లో కనిపిస్తానని చెప్పిన నివేదా.. తాను నిజ జీవితంలో చూడడానికి సీరియస్‌ అమ్మాయిలా కనిపిస్తానని, కానీ నిజానికి అలా ఉండనని చెప్పుకొచ్చింది..

mahesh babu and namratha’s beautiful love story!

rashi khanna photoshoot in backless yellow dress!