in

nithya menon: i am not a Malayali

నిత్యా మీనన్ అనగానే అందరూ ఆమెను మలయాళీ అనుకుంటారు. కానీ, అది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమది మలయాళీ కుటుంబం కాదని నిత్య తెలిపారు. తన అసలు పేరు ఎన్.ఎస్. నిత్య అని… ఎన్ అంటే తన తల్లి నళిని, ఎస్ అంటే తన తండ్రి సుకుమార్ అని చెప్పారు. వారి పేర్లలోని మొదటి అక్షరాలతో పేరు అలా పెట్టారని తెలిపారు. తమ కుటుంబంలో ఇంటి పేర్లు ఉండవని, కులాన్ని పేర్లతో ముడిపెట్టడం ఉండదని చెప్పారు..

అయితే వృత్తిరీత్యా విదేశాల్లో తిరగాల్సి రావడంతో..పాస్ పోర్ట్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తన పేరు వెనుక మీనన్ ను జతచేశానని తెలిపారు. తన పేరు వెనుక మీనన్ ఉండటంతో అందరూ తనను మలయాళీ అనుకుంటారని నిత్య అన్నారు. వాస్తవానికి తాము బెంగళూరుకు చెందినవాళ్లమని చెప్పారు. మూడు తరాలుగా తమ కుటుంబం బెంగళూరులోనే ఉంటోందని తెలిపారు. స్కూల్ లో తన సెకండ్ లాంగ్వేజ్ కన్నడ అని చెప్పారు..!!

actress Adah Sharma opens up On Casting Couch!

Janhvi Kapoor says she wants to do every film with Jr NTR!