in

Nithya Menon complains of enemies in cinema industry!

క ఈ మధ్య నటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్‌పై రెడ్‌ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్‌ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ సంచలన నటి కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి నిత్యామీనన్‌ పలు విషయాల గురించి మనసు విప్పి చెప్పారు..అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని అన్నారు. మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని అన్నారు. వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరన్నారు. నిత్యామీనన్‌తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా భావించలేదని అన్నారు. కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ  తెలుసని స్పష్టం చేశారు..!!

Payal Rajput acting pricey?

roja’s daughter anshu malika to make her tollywood debut?