in

nithya menen Was First Approached For Mahanati!

హానటి సినిమా లో అద్భుతమైన నటన కనబర్చినందుకు ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. అప్పటి వరకు నలుగురిలో ఒక హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన కీర్తి సురేష్ కి, ఈ సినిమాతో సూపర్ స్టార్ స్టేటస్ దక్కింది. అయితే ఈ సినిమాని తొలుత కీర్తి సురేష్ తో చెయ్యాలని అనుకోలేదట. ముందుగా నిత్యా మీనన్ ని అనుకున్నారట , చర్చలు కూడా జరిపి ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట నిర్మాత అశ్వినీ దత్. ఒక వారం రోజులు ఆమెతో షూటింగ్ కూడా జరిపారు. అయితే సెట్స్ లో ఆమె కాస్త పొగరుగా ఉండడం డైరెక్టర్ నాగ అశ్విన్ కి నచ్చలేదట. ఇదే విషయాన్నీ నేరుగా అశ్వినీ దత్ కి చెప్పడం తో ఆయన నిత్యా మీనన్ ని పిలిచి బాగా క్లాస్ పీకినట్టు సమాచారం..

దీనితో బాగా హార్ట్ అయినా నిత్యా మీనన్ ఈ సినిమా నుండి తప్పుకుందట. అలా నిత్యా మీనన్ పొగరు కారణం గా ఈ సినిమా ఆమె చేతి నుండి కీర్తి సురేష్ చేతికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత హిస్టరీ అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా నిత్యా మీనన్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో సావిత్రి పాత్ర పోషించింది. ఒక్కసారి కీర్తి సురేష్ ని చూసిన ఆడియన్స్ కళ్ళు, నిత్యా మీనన్ ని సావిత్రి గా చూడలేకపోయాయి. అంటే కీర్తి సురేష్ మహానటిలో ఎంత అద్భుతంగా నటించిందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలు కానీ, హీరోయిన్లు కానీ వాళ్ళు కొన్ని కారణాల చేత వదులుకున్న సినిమాలను వేరే వాళ్ళు చెయ్యడం, వాళ్ళు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు గా మారిపోవడం వంటివి తరచూ జరుగుతూనే ఉంటుంది. మన కళ్లారా ఇలాంటి సందర్భాలను ఎన్నో చూసాము..!!

mohan babu to play villain in nani’s next!

Is Prabhas teaming Up with Pawan Kalyan in OG?