మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశము చేసిన నిహారిక మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. చివరగా చేసిన ‘సూర్యకాంతం’ సినిమాకూడా నిహారికకు నిరాశపరిచింది. ఇక సినిమాలు వర్క్ అవుట్ కాదని తెలుసుకున్న ఈ మెగా డాటర్ పెళ్లికి సిద్ధమైంది.గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య ను పెళ్లి చేసుకోబోతుంది.
ఆగస్ట్‌లో చైతన్యతో నిశ్చితార్ధం జరుపుకోగా, డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు ప్రభాకర్ రావు తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని, ఆయన పాదాల వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రభాకర్ రావు దంపతులు పెళ్లి ముహూర్తం గురించిన వివరాలను తెలిపారు..అలాగే పెళ్లిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి చేయబోతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు..