in

Niharika Konidela confirms quitting movies because of her husband!

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న నిహారిక సినిమాలకు పూర్తిగా దూరమైంది. తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే “ఆలీతో సరదాగా” షో కి విచ్చేసిన నిహారిక తన గురించి తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. తన కెరీర్ గురించి మాట్లాడుతూ పెళ్లయిన తర్వాత కూడా సమంత వంటి హీరోయిన్లు సినిమాల్లో నటించారు అని పెళ్లికి ముందు పెళ్లి తర్వాత వారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని అన్నారు నిహారిక.

కానీ తన భర్త చైతన్య జేవీ కి తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని అందుకే తాను సినిమాలకి దూరంగా ఉంటుందని చెప్పుకొచ్చింది నిహారిక. అయితే సినిమాలకి దూరంగా ఉంటున్న నిహారిక ప్రస్తుతం ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అంతేకాకుండా యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది నిహారిక. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. మెగా బ్రదర్స్ లో ఎవరంటే ఇష్టం అని అడగగా తన తండ్రి నాగబాబు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన నిహారిక పెదనాన్న మరియు బాబాయి అంటే కూడా అంతే ఇష్టం అని చెప్పుకొచ్చింది.

Vicky Kaushal’s cousin breaks silence on his wedding with Katrina Kaif!

comedian ga adaragottina kaikala satyanarayana!