in

comedian ga adaragottina kaikala satyanarayana!

వరస నటసార్వభౌముడు సత్యనారాయణ కమెడియన్ గ అందరిని ఆశ్చర్యపరిచిన చిత్రం” దేవుడు చేసిన మనుషులు”. ఈ చిత్రంలో విజయనిర్మల అన్నయ్య గ తాగుబోతు క్యారెక్టర్ లో తన ఇమేజీకి భిన్నంగా కామెడీ పండించిన సత్యనారాయణ. ఈ క్యారెక్టర్ కి ముందుగా నాగభూషణం గారిని అనుకున్నారు, ఆయన డేట్స్ కుదరకపోవడం తో కృష్ణ గారు సత్యనారాయణ గారిని పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు, మొదట్లో సత్యనారాయణ కొంచెం వెనుకాడినా నటుడు అన్నవాడు అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించాలి అనుకోని ఆ పాత్ర కు ప్రాణం పోశారు.

యెన్.టి.ఆర్., ఎస్.వీ.ఆర్. కృష్ణ వంటి నటులందరి మధ్య తన కామెడీ రోల్ ను అత్యంత సమర్ధవంతం గ చేసి మంచి మార్కులు కొట్టేసారు. సినిమా రిలీజ్ తరువాత ఎస్.వీ.ఆర్. సత్యనారాయణను పిలిచి చాల బాగా చేసావు, నీ నటన ముందు మేమంతా తేలిపోయాము అంటూ ప్రశంసించారు. ఈ సినిమా తరువాత సత్యనారాయణ గారు విలన్ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్నమయిన క్యారెక్టర్ లు చేస్తూ నవరస నటసార్వభౌముడు అనిపించుకున్నారు.

Niharika Konidela confirms quitting movies because of her husband!

payal rajput new stills in knee length dress!