పవన్, ప్రభాస్ ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. ఇక ప్రభాస్ అయితే నేషనల్ లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌ను దక్కించుకున్నాడో తెలిసిందే. అలాంటి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టి.. వారితో నటించడం అంటే సాధారణ విషయం కాదు..ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్ దెయ్యం పాత్రలో కనిపించనుంది అంటూ కొన్ని వార్తలు తెగ వైరల్ గా మారాయి..
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై రియాక్ట్ అయిన ఆమె..రాజాసాబ్‌లో నేను దెయ్యం పాత్రలో నటించడం లేదని.. కానీ నేను నటించే పాత్ర అందరిని ఆశ్చర్యపరిచేలా..ఆకట్టుకోవడం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ సెట్స్‌లో సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తారని..ఎంతో జోయల్ గా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి..!!