in

NEWS MAKER ASHRITHA DAGGUBATI!

సూపర్ స్టార్ కూతుర్లకు, కొడుకులకు రెడ్ కార్పెట్ ఆహ్వానం ఉంటుంది, ఏ చిత్ర పరిశ్రమలో అయిన. స్టార్ కిడ్స్ అందరు కాకపోయినా, చాలామంది ఆ రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ ని యాక్సప్ట్ చేసి సినీ రంగ ప్రవేశం చేస్తుంటారు, అది తప్పు అనిచెప్పటం నా ఉద్దేశం కాదు. కానీ కొంత మంది మాత్రం అందుకు భిన్నంగా తాము ఎక్కడ ఉన్నారో, అక్కడ అవకాశాలు సృష్టించుకొని, తమ మనసుకు నచ్చిన పని చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటారు అటువంటి వారే న్యూస్ మేకర్స్. అటువంటి ఒక న్యూస్ మేకర్ ఆశ్రిత దగ్గుబాటి.

మూవీ మొఘుల్ రామ నాయుడు గారి మనుమరాలు, విక్టరీ వెంకటేష్ కుమార్తె అయిన ఆశ్రిత, ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో 377 వ రాంక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. భోజన సమయం లో కుటుంబ సభ్యులు అందరు కలసి ఒకే చోట భోజనం చేయటం అనేది రామ నాయుడు గారు ఆ కుటుంబానికి,వారసత్వంగా ఇచ్చిన ఒక మంచి అలవాటు. వివాహం తరువాత స్పెయిన్ లోని, బార్సిలోనాలో సెటిల్ అయిన ఆశ్రిత, తాతయ్య ప్రేరణ, చిన్న నాటి జ్ఞాపకాలు, స్నేహితుల ప్రేమ ఆమెను ప్రేరేపించాయో ఏమో గాని.

ఆమె కుకింగ్ కు దగ్గర అయింది. ” ఇన్ఫినిటీ ప్లేటెర్” పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేస్తున్న కుకింగ్ వీడియోస్ కి 19 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారంటే, రియల్లీ గ్రేట్. “ఎక్సప్లోరింగ్ ది వరల్డ్ త్రు ఫుడ్ ” అనే స్లోగన్ తో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించిన ఆశ్రిత దగ్గుబాటి కి హాట్స్ ఆఫ్. అందుకే మనం బార్సిలోనా లో ఉన్నామా, భాన్సువాడ లో ఉన్నామా ఇంపార్టెంట్ కాదు,” మనలో, మనం” ఉన్నామా లేదా అన్నదే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది, అందుకు చక్కటి ఉదాహరణ ఆశ్రిత దగ్గుబాటి.

Richa Panai Stills at Lava Kusa Movie Audio Launch!

Netflix Shelves Rs 150 Crore Worth ‘Baahubali: Before The Beginning’!